సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం లక్ష్యం నీరుగారుతున్నదని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గడిపె మల్లేశ్ ఆరోపించారు. హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరుల భవనంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో 4000 వేలకు పైగా హరితహారం మొక్కలు పెంటకుప్పలపై వేశారని ఆరోపించారు. మండల ప్రజాపరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్‌కు ఆ మొక్కలు చూపించగా ఆ మొక్కలు ప్రభుత్వానికి కావంటూ బుకాయిస్తున్నారని ఆరోపించారు. రూ.5లక్షలకు వెచ్చించి పెంచిన మొక్కలను పెంటకుప్పల్లో పడివేయడంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి హన్మిరెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు సుదర్శన్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సంజీవరెడ్డి, ఎండి అక్బర్, మల్లారెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 28, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- GOVERNMENT
- HARITHAHARAM
- HUSNABAD
- KARIMNAGAR
- హరితహారం
- హుస్నాబాద్
- Comments Off on పెంటకుప్పలపై.. హరితహారం మొక్కలు