తక్కువ టైమ్‌లో సూపర్ ఫాస్ట్ గా స్టార్ హీరోయిన్ అయిపోయింది పూజాహెగ్డే. తెలుగులో దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. అయితే పూజకు బాలీవుడ్ లో మాంచి క్రేజ్ ఉంది. హృతిక్ రోషన్ ‘మొహంజదారో’ సినిమాతో వారికీ దగ్గరైన పూజ ఆ మధ్య ‘హౌస్‌ఫుల్4’ తో కూడా అక్కడి అభిమానులను ఆకట్టుకుంది. తర్వాత భాయ్ సల్మాన్ ఖాన్‌తో ‘కబీ ఈద్ కబీ దీవాళి’లో జతకడుతోంది. ఈ సినిమా లైన్ లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్టులో పూజ నటిస్తుందన్న వార్త వచ్చింది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మాత, ఫర్హాద్ శ్యామ్‌జీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా ‘బచ్చన్ పాండే’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఒక హీరోయిన్ గా కృతిసనన్ కాగా మరో లీడ్ హీరోయిన్గా పూజ పేరు కూడా వినిపిస్తోంది. అయితే అక్షయ్ కుమార్‌తో ఆల్రెడీ పూజ ‘హౌస్ ఫుల్ 4’లో నటించింది. పూర్తి దక్షిణాది వ్యక్తిగా దర్శనమివ్వనున్నాడట అక్షయ్ ఈ చిత్రంలో. ఈ సినిమా కనుక ఓకే అయితే బాలీవుడ్ లో పూజకు తిరుగుండదని టాక్.
- July 29, 2020
- Archive
- Top News
- సినిమా
- AKSHAYKUMAR
- HRUTHIKROSHAN
- POOJAHEGDE
- పూజాహెగ్డే
- బాలీవుడ్
- సన్మాన్ఖాన్
- హృతిక్ రోషన్
- Comments Off on పూజా.. సూపర్ ఫాస్ట్