రీసెంట్గా కొద్దిరోజుల నుంచి బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న డ్రగ్స్ కేసు టాలీవుడ్ సెలబ్రిటీల వరకు వచ్చిందన్న విషయం తెలిసిందే. సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్ కోణం బయటపడడంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి సుషాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని ఆమె సోదరుడు సహా మరికొంతమందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే రియా చక్రవర్తి అరెస్టయి కొంతమంది సెలబ్రిటీల పేర్లను బయటపెట్టిందని ప్రచారం జరిగింది. అయితే వాటిలో ముందుగా వినిపించినవి రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లే. రకుల్ అయితే తన పేరు బయటికి వచ్చిందన్న వెంటనే షూటింగ్ మధ్యలోనే వదిలేసి ఇంటికి వెళ్లిపోయిందని కథనాలు కూడా వచ్చేశాయి. కానీ అవన్నీ ఉత్తి పుకార్లేనట.
రియా ఎవరి పేర్లూ బయటపెట్టలేదట. ఈ విషయంపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. అసలు రియా చక్రవర్తి ఎవరి పేరూ చెప్పలేదని, ఇప్పుడొస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అనడంతో సోషల్ మీడియాలో సారాను, రకుల్ ను తిట్టినవాళ్లంతా అవాక్కయ్యారు. నెగెటివ్ కమెంట్స్ చేసిన వారంతా ఇప్పుడు సోషల్ మీడియా సాక్షిగా సారీలు చెబుతున్నారు. ‘సారీ రకుల్, సారీ సారా’ అన్న హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. అయితే వారికి మద్దతుగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా తన గొంతు కలిపింది. ‘బుక్ పై ఉండే కవర్ ను చూసి జడ్జ్ చేయొద్దు..’ అని కోట్ చేస్తూ తనదైన స్టైల్ లో రకుల్, సారాలకు సారీ చెప్పింది. నిజానికి సమంత వారిపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. కానీ నెటిజన్స్ తరఫున సారీ చెప్పింది. సమంత రకుల్ కు సపోర్ట్ గా నిలవడం అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొన్న రకుల్ కు అందరూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.