సారథి న్యూస్, కర్నూలు: నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు జరిగే తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని జేసీ–2(అభివృద్ధి) రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసులు, హౌసింగ్ పీడీ, ఎన్‌ఐసీ జిల్లా ఇన్‌చార్జ్ అరుణతో పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సదుపాయాలు, ఏర్పాట్లకు సంబంధించి త్వరగా నివేదిక సమర్పించామన్నారు. జిల్లాలోని మంత్రాయం, కౌతాళం, కోడుమూరు, కర్నూలు తదితర ప్రాంతాల్లో ఏర్పాటుచేసే పుష్కర ఘాట్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై చర్చించారు.
- October 8, 2020
- Archive
- Top News
- Kurnool
- PUSHKARALU
- TUNGABADRA
- కర్నూలు
- తుంగభద్ర
- పుష్కరాలు
- Comments Off on పుష్కరాల ప్రణాళిక రూపొందించండి