Breaking News

పుష్కరాలను సక్సెస్​ చేయండి

పుష్కరాలను సక్సెస్​చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల: అన్నిశాఖల అధికారుల సమన్వయంతో తుంగభద్ర నది పుష్కరాలను సక్సెస్​ చేయాలని అలంపూర్​ ఎమ్మెల్యే వీఎం అబ్రహం సూచించారు. గురువారం ఆయన జోగుళాంబ గద్వాల కలెక్టరేట్​లో కలెక్టర్ ​శృతిఓజా, ఎస్పీ రంజన్​రతన్​ కుమార్​తో కలిసి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఘాట్స్ వద్ద ఐమాక్స్ లైటింగ్ సిస్టం, మొబైల్ టాయిలెట్స్, ఆర్​డబ్ల్యూఎస్​శాఖ వారి ఆధ్వర్యంలో శుద్ధమైన నీటిని ఏర్పాటు చేయాలని, బ్లీచింగ్​ పౌడర్​ చల్లాలని, అవసరమైన చోట వలంటీర్లను నియమించాలని సూచించారు. ప్రతి ఘాట్ వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేయాలని, గజఈతగాళ్లను నియమించాలని ఆదేశించారు. అలంపూర్ నుంచి కర్నూలుకు బస్సులు నడపాలని, బైరాపురం, బస్వాపురం వద్ద గ్రావెల్ రోడ్ వేయించి బస్సులు నడపాలన్నారు. ప్రతిఘాట్ వద్ద వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అంబులెన్స్​లు ఏర్పాటు చేయాలని, థర్మల్​ స్కానింగ్​ చేయాలని, విద్యుత్​శాఖ వారి ఆధ్వర్యంలో స్తంభాలు వేసి.. వైర్లు లాగాలని సూచించారు. కోవిడ్​19 నిబంధనలు పాటిస్తూనే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ పుష్కరాలు నిర్వహించాలని సలహాలు ఇచ్చారు. సమావేశంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్ ​శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శ్రీరాములు, జిల్లా పంచాయతీ అధికారి శ్రీకృష్ణ, ఆర్​డబ్ల్యూఎస్​ జిల్లా అధికారి శ్రీధర్ రెడ్డి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.