సారథి న్యూస్, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లో ఆమె పీవీ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్రపు సత్యనారాయణ రచించిన ‘స్థితప్రజ్ఞుడు’ పుస్తకాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం ఆవిష్కరించారు.
కరీంనగర్ జిల్లా రామడుగులోని పోలీస్ స్టేషన్లో పీవీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఇంజరాపు పుజా, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ మురళీధర్, ఏసీపీలు ప్రసన్న కుమార్, వెంకట్రావు, విజయబాబు, ఆర్ఐ రవి, శ్రీనివాస్ , సాంబశివరావు , సీఐలు తుమ్మ గోపి, రవికుమార్ , సుడా చైర్మన్ విజయ్ కుమార్, మేయర్ పాపాలాల్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, కలెక్టర్ ఆర్వీ కర్ణన్, పోలీస్ కమిషనర్ తఫ్సిర్ ఇక్బాల్, ఎమ్మెల్యేలు కే ఉపేందర్ రెడ్డి, రాములు నాయక్, చిట్టిబాబు, ఏవో అక్తరూనీసాబేగం, రామడుగు ఎస్సై అనూష సెక్షన్ సూపరిండెంట్లు జానకిరామ్, నాగేశ్వరరావు, హనీఫ్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ మధుసూదన్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్, జెడ్పీ చైర్మన్ బిందు, ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.