లక్నో: అంగరంగవైభవంగా జరుగాల్సిన ఆ పెండ్లి అర్ధాంతరంగా ముగిసింది. పీటలమీదే పెండ్లి కూతురు మృతిచెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొన్నది. ఈ దారుణ ఘటనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కనౌజ్ జిల్లా వేదికయ్యింది. థాథియా పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో వధువు ఇంట్లో పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరుడు సంజయ్.. తన కుటుంబ సమేతంగా వధువు వనిత ఇంటికి చేరుకున్నాడు. కాగా, పెళ్లితంతు జరుగుతుండగా.. వనిత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే దవఖానకు తరలించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది ఆమెకు చికిత్స చేసేందుకు నిరాకరించారు. కొవిడ్ పరీక్షలు చేయాలని అందులో నెగెటివ్‌గా వస్తేనే జాయిన్ చేసుకుంటామని డాక్టర్లు తేల్చిచెప్పారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు కాన్పూర్‌కు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. కుటుంబ సభ్యులు 112 ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వనిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు.
- June 29, 2020
- Archive
- జాతీయం
- BHAGATHPOORVA
- MARRIGE
- UTTARPRADESH
- పెండ్లి కూతురు
- మృతి
- విషాధం
- Comments Off on పీటల మీదే.. పెళ్లి కూతురు మృతి