Breaking News

పిల్లలమర్రికి పునర్జీవం

పిల్లలమర్రికి పునర్జీవం

సారథి న్యూస్, మహబూబ్​నగర్: పాలమూరు జిల్లాకు తలమానికమైన పిల్లలమర్రి పునర్జీవం సాధించింది. పట్టణ శివారులోని సుమారు మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. 700 ఏళ్ల వయస్సు ఉన్న ఈ మర్రివృక్షం ప్రఖ్యాత పర్యాటక క్షేత్రంగా వెలుగొందింది. మర్రి వృక్షాల కొమ్మలు, వేర్లకు చెదలు, శిలింద్ర వ్యాధులు సోకడంతో క్రమక్రమంగా క్షీణించింది. ఇది గమనించిన పూర్వ కలెక్టర్ ​రోనాల్డ్​రాస్ ​ప్రత్యేక చొరవ తీసుకుని బొటానికల్​ గార్డెన్​ శాస్త్రవేత్తలు, సంబంధిత డాక్టర్లను పిలిపించి సంరక్షణ చర్యలు చేపట్టారు. దీంతో పిల్లలమర్రి 140 వేర్లు, కొమ్మలు కొత్తగా ఉద్భవించి జీవం పోసుకున్నాయి. కొత్తగా చిగురిస్తున్న మర్రిని చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.