Breaking News

పిల్లలకు దేశభక్తి నేర్పిద్దాం

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల: నేటితరం పిల్లలకు దేశభక్తితో పాటు క్రమశిక్షణ, ఉన్నత వ్యక్తిత్వం నేర్పించాల్సిన బాధ్యత గురువులపై ఉందని మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే.అరుణ అన్నారు. టీచర్​, ప్రముఖ కవి ఎంఎన్‌ విజయకుమార్‌ రచించిన ‘విజయ సంకల్పం, విజయతీరాలు’ అనే పుస్తకాన్ని శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆమె నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకుండా టీచర్లు శ్రద్ధచూపాలని సూచించారు. విద్యతోనే నవ సమాజాన్ని స్థాపించగలమనే నమ్మకాన్ని వారికి తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు కృష్ణారెడ్డి, రాముడు, నర్సింహ, వెంకట్రాములు, నాగరాజు, భాస్కర్‌, విద్యార్థులు నిఖిత, ఉదయ్‌కిరణ్‌ పాల్గొన్నారు.