ఏ పాత్రకైనా ఇట్టే సూటైపోతుంది కన్నడ ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ‘అల వైకుంఠ పురములో’ తర్వాత పూజా ప్రభాస్ సినిమా ‘రాధే శ్యామ్’లో నటిస్తోంది. ఇటీవలే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఫస్ట్‌లుక్‌ను కూడా రివీల్ చేశారు చిత్ర బృందం. ఫస్ట్ లుక్‌లో ప్రభాస్, పూజా రొమాంటిక్ లుక్కు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫస్ట్ లుక్‌లో హీరోతో పాటు హీరోయిన్ కూడా రివీల్ చేయడంతో సినిమాలో పూజా పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఎక్కువే అని అర్థమైంది. ఈ చిత్రం లో టీచర్‌గా కనిపించనున్న పూజ కథలో ఆమె పాత్ర చాలా కీలకంగా ఉంటుందని అంటున్నారు యూనిట్ సభ్యులు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సమ్మర్లో విడుదలకు సిద్ధం చేస్తారట.
- July 12, 2020
- Archive
- Top News
- సినిమా
- FIRSTLOOK
- POOJA HEGDE
- PRABHAS
- పూజాహెగ్డే
- ప్రభాస్
- రాధే శ్యామ్
- Comments Off on పాఠాలు నేర్పే పంతులమ్మ