Breaking News

పవర్ స్టార్ ఫస్ట్ లుక్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్దిరోజుల క్రితం ‘పవర్ స్టార్’ అనే టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించారు. అలాగే ఆ మూవీలోని హీరోని కూడా పరిచయడం చేశారు. ఆ హీరోకి ఎవరైనా స్టార్ హీరో పోలికలు ఉంటే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే అని చెబుతుంటారు వర్మ. గురువారం చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో హీరో ఆలోచిస్తూ కూర్చొని ఉండగా.. దానితో పాటు వర్మ పోస్టర్ పై ఎన్నికల తరువాత కథ అని, సినిమా దేనిగురించి ఉంటుందో ఓ హింట్ ఇచ్చారు. కొన్నాళ్లుగా వివాదాన్నే పెట్టుబడిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు వర్మ, పవర్ స్టార్ మూవీతో మరిన్ని వివాదాలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పవర్ స్టార్ మూవీ ఆర్ జీవీ వరల్డ్ థియేటర్ లో విడుదల కానుంది. దీంతో పాటు మర్డర్, వైరస్, 12 ఓ క్లాక్, థ్రిల్లర్ అనే మరో నాలుగు సినిమాలు ఆయన తెరకెక్కిస్తున్నాడు.