పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. సాగర్ కె.చంద్ర దర్శకుడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్మెంట్స్బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. స్క్రిప్ట్ ను ఎస్. రాధాకృష్ణ దర్శక నిర్మాతలకు అందించారు. దిల్ రాజు, వెంకీ అట్లూరి సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ కు ఇది అఫీషియల్ రీమేక్. ఈ సినిమాలో మరోసారి పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోలు ఉండే ఈ మూవీలో మరో హీరోగా రానా పేరు ప్రచారంలో ఉంది. ఓపెనింగ్ రోజునే రానా నటిస్తున్నట్టు అపీషియల్ గా అనౌన్స్ చేశారు. ‘చాలామంది స్టార్స్ తో కలిసి నటించానని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం హ్యాపీ’ అంటూ రానా ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కెమెరా ప్రసాద్ మూరెళ్ల, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్షన్ ను ఏఎస్ ప్రకాష్ పర్యవేక్షిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో రివీల్ చేయనున్నారు.
- December 21, 2020
- Archive
- Top News
- సినిమా
- DILRAJU
- PAVAN KALYAN
- PDP PRASAD
- VENKY ATLURI
- అయ్యప్పనుమ్ కోషియుమ్
- తమన్
- పవన్ కళ్యాణ్
- రానా
- Comments Off on పవన్ కళ్యాణ్ మూవీ స్టార్ట్