Breaking News

పల్లెల్లోనూ జాగ్రత్త అవసరం

సారథిన్యూస్, రామడుగు: జీహెచ్​ఎంసీలో కరోనా విజృంభిస్తుండటంతో హైదరాబాద్​లోని ప్రజలంతా పల్లెలకు వస్తున్నారు. ఈ క్రమంలో కరోనా పల్లెలకు కూడా పాకే అవకాశం ఉన్నదని.. అందువల్ల గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కరీంనగర్​ జిల్లా రామడుగు మండలం రంగసాయిపల్లిలో గ్రామానికి చెందిన యువకులు కరోనాపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. దుకాణాల వద్ద, రచ్చబండ వద్ద ప్రజలు గుంపులుగా ఉండొద్దని, అనవసరంగా గ్రామంలో తిరుగొద్దని సూచించారు. అనవరంగా మాస్కులేకుండా గ్రామంలో తిరిగితే రూ.500 జరిమానా విధించాలని సర్పంచ్​ సాదు పద్మకు వినతిపత్రం సమర్పించారు. గ్రామస్థులకు అవగాహన కల్పించిన వారిలో యమా అరుణ్ భగత్, కోరే కరుణాకర్ రెడ్డి, మండల విజయ్, చిలుముల అంజయ్య, ఉప సర్పంచ్​ గుడ్ల శేఖర్, మండల నరేశ్​ తదితరులు ఉన్నారు.