సారథి న్యూస్, బెజ్జంకి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బెజ్జంకి ఎంపీపీ లింగాల నిర్మల పేర్కొన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామంలో ఆమె తడి, పొడి చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కనగండ్ల కవిత, మార్కెట్ కమిటి చైర్మన్ పోచయ్య, సర్పంచ్ సీతా లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ భూమయ్య, ఎంపీటీసీ మల్లేశంగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
- June 18, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BEJJANKI
- HYDERABAD
- SIDDIPET
- TELANGANA
- ఎంపీపీ
- సర్పంచ్
- Comments Off on పరిశుభ్రతతో రోగాలు దూరం