Breaking News

పరిశుభ్రతతో రోగాలు దూరం

TRS

సారథి న్యూస్​, హుస్నాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సతీశ్​కుమార్ సూచించారు. గురువారం పట్టణంలోని ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన సర్వసభ్య ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పలు గ్రామాల్లో మిషన్ భగీరథతో పాటు పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయని వాటిని వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, ఎంపీపీ మానస, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఇంచార్జ్ ఎంపీడీవో సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.