Breaking News

పనుల్లో నిర్లక్ష్యం.. కలెక్టర్​ సీరియస్​

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​​: రైతువేదికల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని నాగర్​కర్నూల్​ కలెక్టర్​ శర్మన్​​ హెచ్చరించారు. సెప్టెంబర్​ 31 నాటికి రైతువేదిక నిర్మాణపనులు పూర్తిచేయాలని సూచించారు. గురువారం తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పోతిరెడ్డిపల్లి, కోడుపర్తి గుమ్మకొండ, తిమ్మాజిపేట, ఇప్పలపల్లి, అవంచ, మారేపల్లి, వట్టెం, బిజినేపల్లి, వడ్డేమాన్, లట్టుపల్లి, మంగనూరు, ఖానాపూర్, పాలెం ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను కలెక్టర్‌ పరిశీలించారు. రైతు వేదిక పనులు నత్తనడకన కొనసాగుతున్నందున కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్‌ వెంట తిమ్మాజిపేట ప్రత్యేకాధికారి గోవిందరాజులు, ఆర్డీవో నాగలక్ష్మి తహసీల్దార్లు సరస్వతి, అంజిరెడ్డి ఎంపీడీవోలు కరుణశ్రీ, హరినాథ్ గౌడ్, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు.