సారథి న్యూస్, నల్లగొండ: మిషన్ భగీరథ పనులు అసంపూర్ణంగా ఉన్నప్పుడు సర్పంచ్లు పూర్తయినట్లు సంతకాలు పెట్టకూడదని మంత్రులు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మిషన్ భగీరథ పథకం పుట్టిందే మునుగోడులో పుట్టిన ఫ్లోరిన్ ను నిరోధించడం కోసమేనని అన్నారు. బుధవారం నల్లగొండలో జరిగిన సమీక్ష సమావేశంలో వారు మాట్లాడారు. 843 పంచాయతీలు 1,670 ఆవాస ప్రాంతాలతో పాటు 19 మున్సిపాలిటీలను కలుపుకుని మొత్తం 1,689 ఆవాసాల్లో మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీళ్లు ఇస్తున్నామని చెప్పారు. జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చీమకుర్తి లింగయ్య, ఎన్.రవీంద్ర కుమార్, నోముల నర్సింహయ్య, భాస్కరరావు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్సీ కృపాకర్ రెడ్డి పాల్గొన్నారు.
- June 10, 2020
- Archive
- Top News
- నల్లగొండ
- MISSION BAGIRATHA
- నల్లగొండ
- భగీరథ
- సమీక్ష
- Comments Off on పనులు పూర్తయితేనే సంతకాలు పెట్టండి