సారథిన్యూస్, ఖమ్మం: రోడ్డుప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా జగ్గయపేట మండలం వేదాద్రి సమీపంలో చోటుచేసుకున్నది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద గోపవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం బంధువులతోకలిసి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ట్రాక్టర్లో వెళ్తున్నారు. వేదాద్రి సమీపంలో ట్రాక్టర్ను ఎదురుగా వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరోముగ్గురు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పెదగోపవరంతోపాటు అదే మండలానికి చెందిన జమలాపురం, కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం జయంతి గ్రామానికి చెందిన వారున్నారు. ఈ ఘటన పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు.
- June 17, 2020
- Archive
- క్రైమ్
- AP
- CM
- ROAD ACCIDENT
- TELANGANA
- ఎర్రుపాలెం
- వేదాద్రి
- Comments Off on పది మందిని బలిగొన్న రోడ్డుప్రమాదం