Breaking News

‘పది’ పరీక్షలు రద్దు

  • ఇంటర్నల్​, అసెస్​మెంట్ మార్కుల ఆధారంగా ప్రమోట్​
  • పై క్లాసెస్​కు 5,34,903 మంది స్టూడెంట్స్​
  • ఉన్నతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ నిర్ణయం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను నిర్వహించడం సాధ్యం కాకపోవడంతో ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండానే స్టూడెంట్స్​ను పై తరగతులకు ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్​ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీంతో 5,34,903 మంది పదవ తరగతి విద్యార్థులు ప్రమోట్​ అయ్యారు. టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్ పై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్ లో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మొత్తం ఆరు సబ్జెక్టులు, 11 పేపర్లు ఉండగా, అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించి మూడు పేపర్ల పరీక్షలు కంప్లీట్​ అయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం టెన్త్​ క్లాస్​ ఎగ్జామ్స్​ను వాయిదా వేసింది. పది పరీక్షల నిర్వహణపై సీఎం కేసీఆర్​ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. చివరికి రాష్ట్రంలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారుచేశారు. గతంలో స్కూలులో నిర్వహించిన ఇంటర్నల్​, అసెస్​మెంట్​ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడ్​లను లెక్కలోకి తీసుకుని టెన్త్​ క్లాస్​ స్టూడెంట్స్ ను పై క్లాస్​కు ప్రమోట్​ చేయాలని సీఎం కేసీఆర్​ నిర్ణయించారు. సమావేశంలో విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, సీఎస్​ సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, సీఎంవో ముఖ్యకార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు పాల్గొన్నారు.