సారథి న్యూస్, కర్నూలు: రైతు సంక్షేమార్థం అహర్నిశలు కృషిచేసే సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆశయం నెరవేర్చాలని, యార్డులో రైతుకు మెరుగైన సేమ, సదుపాయాలు కల్పించాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య నూతన కమిటీ సభ్యులకు సూచంచారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ అధ్యక్షతన నూతన చైర్‌పర్సన్ రోకియాబీ, వైస్ చైర్మన్ రాఘవేంద్రారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల రైతు క్షోభకు గురయ్యారని, జగనన్న హయాంలో అలాంటి పరిస్థితి తలెత్తరాదన్నారు. అనంతరం నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు మార్కెట్ యార్డు ఉన్నత పదవుల అప్పగించడం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికే సాధ్యమైందన్నారు. ఆ తర్వాత పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాల పేద బడుగు బలహీనవర్గాల అభివృద్ధే లక్ష్యంగా సమప్రాధాన్యం కల్పించి నేడు ఈ కమిటీ ద్వారా నిర్మితమైందని ఈ కమిటీలో చోటు దక్కించుకున్న ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని తెలియజేశారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు అప్పగించలేదని, కేవలం డబ్బు ఇచ్చిన వారికి, అగ్రవర్ణాల వారికే కట్టబెట్టిందని ఆరోపించారు.
అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
మార్కెట్ యార్డ్ సెక్రటరీ విజయక్ష్మితో నూతనంగా ఎన్నికైన చైర్ పర్సన్ రోకియాబీతో, వైస్ చైర్మన్ రాఘవేంద్రారెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. తదనంతరం కమిటీ డైరెక్టర్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిటీ చైర్‌పర్సన్ రోకియాబీ మాట్లాడుతూ.. ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలాంటి పరిస్థితుల్లో వమ్ము చేయమన్నారు. తమపై నమ్మకం ఉంచి పదవులు అప్పగించిన ఎమ్మెల్యేలకు కృతజ్ఞతు తెలియజేస్తున్నామన్నారు. రైతు సంక్షేమార్థం సేమ అందిస్తామని, మెరుగైన సదుపాయాలు కల్పిస్తామన్నారు.
- October 8, 2020
- Archive
- CM JAGAN
- Kurnool
- MARKET COMMITTEE
- YSRCP
- కర్నూలు
- మార్కెట్ కమిటీ
- వైఎస్సార్సీపీ
- సీఎం జగన్
- Comments Off on పదవులకు మచ్చ తేవొద్దు