సారథి న్యూస్, నకిరేకల్: నకిరేకల్ మండలం పాలెం గ్రామంలో గురువారం నిర్వహించిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొని భౌతికకాయానికి నివాళులు అర్పించారు. నర్సింహ్మయ్య కుటుంబసభ్యులను ఓదార్చారు. ఆయన వెంట మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మహమూద్ అలీ, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీఎంపీ బూర నర్సయ్య గౌడ్, తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగడి సునిత మహేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ కుమార్ నాయక్, నల్లగొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- December 3, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- నల్లగొండ
- CM KCR
- NETHI VIDYASAGAR
- NOMULA NARSIHMAIAH
- TALASANI
- తలసాని
- నకిరేకల్
- నేతి విద్యాసాగర్
- నోముల నర్సింహయ్య
- సీఎం కేసీఆర్
- Comments Off on నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో సీఎం కేసీఆర్