Breaking News

నేనొస్తున్నా..

నేనొస్తున్నా..

‘సయ్యారే సయ్యారే సయ్యా హోరే.. ఓరుగల్లు గల్లుకే పిల్ల గుండె ఝల్లుమన్నాదే..’ మరచిపోయే పాట ఇది. ‘సైనికుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసినా కెరీర్ మాత్రం ‘ప్రేమికులు’ సినిమాలో హీరోయిన్​గానే స్టార్ట్ చేసింది. మంచి ఫామ్​లో ఉండగానే కర్ణాటకకు చెందిన ఓ బిజినెస్ మ్యాన్​ను పెళ్లాడి ఇద్దరి పిల్లల తల్లయ్యింది. మళ్లీ ఇప్పుడు సినిమాల్లో నటించాలనిపిస్తోందట. అందుకే ఓ లేడీ ఓరియండెట్ సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది కామ్నజెఠ్మలానీ. అదికూడా తాను ఒకప్పుడు హీరోయిన్ గా పరిచయమైన తెలుగులోనే.

ప్రభు అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఇప్పటికే సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇక రియల్ లైఫ్ లో ఇద్దరు పిల్లల తల్లి అయిన కామ్న ఈ సినిమాలో కూడా చిన్న పాపకు తల్లిగా కనిపించనుందట. మొదటి ఎంట్రీలో గ్లామర్ రోల్స్ లోనే కనిపించిన కామ్నా.. ఇప్పుడు లేడీ ఓరియంటెట్ సినిమాలో నటించనుండటం..అదీకాక తల్లి పాత్రలో.. మరి కామ్నా ఈ రీఎంట్రీలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏమో.