బికినీ డ్రెస్‌లో బాలీవుడ్లో టాప్ హీరోయిన్లు కనిపించినంతగా టాలీవుడ్ భామలు కనిపించరనే చెప్పుకోవచ్చు. లేటెస్ట్ హీరోయిన్స్ అనుష్క, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ హీరోయిన్లు మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. అయితే లేటెస్ట్ ఆపిల్ బ్యూటీ హన్సిక కూడా నేనూ బికినీ వేసేస్తానంటోంది. అనడమే కాదు సోషల్ మీడియాలో బికినీ వేసిన డ్రెస్‌లతో ఫోజులు కూడా ఇచ్చేసింది. పైగా దానికో వివరణ కూడా ఇస్తోంది.
తాను నటించనున్న 50వ చిత్రం ‘మహా’ సినిమాలో హన్సిక కాషాయ బట్టలు వేసుకుని గంజాయి దమ్ము కొడుతూ యోగిని పాత్ర పోషిస్తుందట. అలాగే బికినీ వేసుకుని.. స్మోక్ చేస్తూ కూడా కనిపిస్తుందట. దాని గురించి చెబుతూ ‘ఇప్పటి వరకూ నేను ఎప్పుడూ బికినీ వేసుకుని నటించలేదు.. అలాంటి సీన్లు నేను చేసిన సినిమాల్లో రాలేదు.. ఇప్పుడు వచ్చింది కాబట్టి చేస్తున్నా.. లాక్ డౌన్ సమయంలో ఎక్సర్సైజ్లు చేసి ఫిజక్ ను కూడా బికినీ వేసుకోడానికి అనుకూలంగా ఉండేలా మార్చేసుకున్న. ”అంటోంది హన్సిక. కొద్ది రోజులుగా ఎలాంటి హిట్లకూ నోచుకోని హన్సిక ఈ బికినీ అందాలతో అయినా హిట్ కొడుతుందేమో చూడాలి.