Breaking News

‘నేట్రికన్’.. టీజర్ టాక్

‘నేట్రికన్’.. టీజర్ టాక్

తమిళ, తెలుగు లేడీ సూపర్ స్టార్ గా ఫేమస్ అయిన నయనతార తనదైన స్టైల్ లో ముందుకెళ్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలనే ఎక్కువ ఎంచుకుంటోంది కూడా. బుధవారం నయన్ బర్త్​ డే. ఈ సందర్భంగా ఆమె ప్రధాన పాత్ర వస్తున్న ‘నేట్రికన్’ మూవీ టీజర్ రిలీజైంది. ఈ చిత్రాన్ని నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై క్రాస్ పిక్చర్స్ తో కలిసి నిర్మించాడు. ‘గృహం’ ఫేమ్ మిలింద్ రౌ దర్శకత్వం వహించాడు. ఇందులో నయన్ కళ్లు కనిపించని అమ్మాయి పాత్ర పోషించింది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది. బ్యాగ్రౌండ్ లో లేడీ వాయిస్ తో టీజర్ స్టార్టయింది. ఒకమ్మాయి రోడ్డుపై పడి ఉంటుంది..‘ఒక ఊరులో కొన్ని మేకపిల్లలు ఉన్నాయి.. నక్క ఒకటి వాటిని వెంటాడి క్రూరంగా చంపేస్తూ ఉంటుంది.. వాటిలో ఒక ధైర్యమైన మేకపిల్ల ఉంది.. అది నక్క కోసం ఒక గొయ్యి తవ్వింది.. అని వాయిస్ వస్తుంటే.. విజువల్స్​లో ఒక సైకో ఒకమ్మాయిని గొలుసులతో బంధించి అతి దారుణంగా హింసించడం కనిపిస్తుంది.. ‘నీ కళ్లకు ఏమీ కనిపించకపోవచ్చు.. నా కంటికి మాత్రం నువ్వొక్కదానివే కనిపిస్తున్నావ్..’ అంటూ విలన్ కర్కశమైన గొంతు వినిపిస్తుంది.. వెంటనే సినిమా చూడాలన్న ఇంటరెస్ట్ కలిగించేలా ఉంది టీజర్. క్రైమ్ మిస్టరీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అంధురాలిగా మారిన ఓ పోలీస్ అధికారిణి తనకు ఎదురయ్య అడ్డంకులను సాహసంతో ఎలా ఎదిరించిందని చూపించారు. గోపాలకృష్ణన్ బ్యాక్​ గ్రౌండ్ స్కోర్ ఇవ్వగా..డీవోపీఆర్ డీ రాజశేఖర్ విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. అజ్మల్, మణికందన్, శరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.