- బీజేపీ నేత విజయ పాల్ రెడ్డి
సారథి న్యూస్, హుస్నాబాద్: గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ నీళ్లు తీసుకొస్తే గుండు గీసుకుంటామని బీజేపీ హుస్నాబాద్ అసెంబ్లీ కన్వీనర్ నాగిరెడ్డి విజయ పాల్ రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టును పూర్తిచేయకుండా ఎవరు అడ్డుపడ్డారని ప్రశ్నించారు. ముందు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో అక్కన్నపేట బీజేపీ మండలాధ్యక్షుడు వీరాచారి, హుస్నాబాద్ టౌన్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, శంకర్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, సతీష్ పాల్గొన్నారు.