అనుష్క హీరోయిన్‌గా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన ‘నిశ్శబ్దం’ ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ కూడా అయింది. థియేటర్స్ లోనే రిలీజ్ చేస్తామని మొదటి నుంచి చెప్పిన టీమ్ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటీటీకే ఓటువేసింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.
మాధవన్, మైఖేల్ మాడ్సన్, అంజలి, సుబ్బరాజు, షాలినీపాండే, అవసరాల శ్రీనివాస్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్, వివేక్ కూచిబొట్ల నిర్మాతలు. గోపి సుందర్ సంగీతం అందించారు. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఇందులో అనుష్క ఓ మూగ అమ్మాయిగా కనిపించనుంది. ఓ విల్లాలో తను చూసిన ట్రాజిక్ ఇన్సిడెంట్స్ కారణంగా చిక్కుల్లో పడుతుంది.
క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ని ఎదుర్కొంటుంది. పోలీస్ డిటెక్టివ్స్ ఈకేసుపై లోతైన విచారణ చేస్తుంటారు. అనుక్షణం ఉత్కంఠ రేపుతూ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్‌ను అందించే సినిమా అని అమెజాన్ సంస్థ చెబుతోంది. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అనుష్కకు కొత్త కాదు. కానీ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పే పాత్రల్లో అదరగొట్టే అనుష్క ఇప్పుడు ఈ డఫ్ అండ్ డమ్ క్యారెక్టర్‌తో ఎలా మెప్పిస్తుందో చూడాలి.