సారథి న్యూస్, పెద్దపల్లి: ప్రాజెక్టుల నిర్మాణాలకు భూములిచ్చిన రైతుల త్యాగం మరువలేనిదని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన పాలకుర్తి మండలం వెంనూర్లో ఎల్లంపల్లి రిజర్వాయర్ కోసం భూములు కోల్పోయిన రైతులతో సమావేశమయ్యారు. నిర్వాసితులందరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పాలకుర్తి తహసీల్దార్ రాజమణి, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పాల్గొన్నారు.
- July 18, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- LAND
- PEDDAPALLY
- PROJECT
- నిర్వాసితులు
- రైతులు
- Comments Off on నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం