మానోపాడు: కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో పరిశుభ్రత ఎంతో ముఖ్యమని జోగుళాంబ గద్వాల డీఎంహెచ్వో చందునాయక్ పేర్కొన్నారు. గురువారం ఆయన మానోపాడు పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పీహెచ్సీ ఆవరణలో చెత్త పేరుకుపోయి ఉండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. రోగులకు విధిగా శానిటైజర్ లను అందించడంతోపాటు కరోన మహమ్మారి పట్ల భయం తొలగించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ సవిత, సూపరవైజర్లు చంద్రన్న, లలిత తదితరులు పాల్గొన్నారు.
- July 30, 2020
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- DOCTOR
- GADWAL
- HOSPITAL
- PHC
- డీఎంహెచ్వో
- మానోపాడు
- Comments Off on నిర్లక్ష్యాన్ని సహించేది లేదు