సారథిన్యూస్,రామడుగు: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ నేతలు శుక్రవారం 100 మంది నిరుపేదల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ యూత్ పార్లమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పంజల శ్రీనివాస్, గోపాల్రావుపేట సర్పంచ్ సత్య ప్రసన్న, కాంగ్రెస్ నాయకులు దేవకిషన్, శంకర్, బాలగౌడ్, పిండి శ్రీనివాస్ నాగరాజు, బాపురాజ్, మల్లికార్జున్, రాయుడు, మాణిక్యం, వెంకటేశ్, ఉదయ్ పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CONGRESS
- KARIMNAGAR
- RAHUL
- RAMADUGU
- జన్మదినం
- రాహుల్ గాంధీ
- Comments Off on నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ