సారథి న్యూస్, హైదరాబాద్: నిమ్స్ హాస్పిటల్ ను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సోమవారం సందర్శించారు. కరోనా మహమ్మారి బారినపడి చికిత్స పొందుతున్న డాక్టర్లు, వైద్యసిబ్బందిని ఆమె పరామర్శించారు. నిమ్స్‌లో ఇప్పటివరకు నలుగురు ప్రొఫెసర్లు, 8 మంది రెసిడెంట్ డాక్టర్లు, 8మంది పారామెడికల్ సిబ్బంది కరోనా బారినపడ్డారు. ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.