సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్–19 మార్గదర్శకాల ప్రకారమే జరుపుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఈ మేరకు బేగంబజార్లోని బహేతిభవన్లో అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు, ఉపాధ్యక్షుడు రామరాజు నేతృత్వంలో సమితి సభ్యులు సమావేశమయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి భక్తులు మాస్కులు కట్టుకోవడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వాడాలని సూచించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రభుత్వం భక్తులకు తగిన ఏర్పాట్లు చేసి సహకరించాలని ఉత్సవ సమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
- July 24, 2020
- Archive
- హైదరాబాద్
- CARONA
- HYDERABAD
- VINAYAKAVHAVITHI
- కోవిడ్–19
- గణేష్ ఉత్సవాలు
- వినాయక చవిత
- Comments Off on నిబంధనలకు అనుగుణంగానే గణేష్ ఉత్సవాలు