సారథి న్యూస్, హెల్త్డెస్క్: ఇటీవల పెద్దలు, మధ్యవయస్సువాళ్లు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమితో ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్న యువత సరైన నిద్రలేకపోవడంతో డిప్రెషన్, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8గంటలపాటు నిద్రించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.
- రాత్రి పడుకొనేముందు ఒక అరటిపండు తింటే శరీరంలో అన్ని అవయవాలకు క్రమపద్ధతిలో రక్తం సరఫరా అవుతుంది. దీనివల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి నిద్రపడుతుంది.
- బాదంపప్పను గంట సేపు పాలలో నానబెట్టి.. ఆ పాలను తాగితే త్వరగా నిద్రలోకి జారుకోవచ్చు. బాదంపప్పుతో కండరాలు చాలా ఉపశమనాన్ని పొందుతాయి.
- గోరువెచ్చని పాలు.. నిద్రకు బాగా ఉపకరిస్తాయి. పాలలో ఉండే న్యూరో ట్రాన్స్‌మీటర్స్ గాఢ నిద్రకు సహకరిస్తాయి. మధ్యాహ్నం సమయంలో నిద్రించేవాళ్లు పెరుగన్నం తిని చూడండి. ఇట్టే నిద్రపడుతుంది.
- పడుగోడానికి ముందు గ్రీన్ టీ తాగితే ఒత్తిడి, ఆందోళన తగ్గి మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
- చెర్రీపండ్లు, చెర్రీ జ్యూస్ నిద్రకు ఎంతో సహకరిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. చెర్రీ పండ్లలో ఉండే ‘మెలటోనిన్’ శరీరంలోని జీవక్రియను మెరుగుపరిచి నిద్రకు సహాయపడుతుంది.