Breaking News

నారప్ప న్యూపోస్టర్​ అదిరింది

విక్టరీ వెంకటేశ్​ హీరోగా శ్రీకాంత్​ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్​ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్​ లుక్​ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్​’కు రీమేక్​గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్​ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అక్కడ 100 కోట్లకు పైగా వసూలు చేసిందని టాక్. కాగా తెలుగులో వెంకటేశ్​కు జోడీగా ప్రియమణి నటిస్తున్నది. తాజాగా నారప్ప పెద్ద కొడుకు మునికన్నా లుక్ విడుదల చేసింది చిత్రబృందం. మునికన్నా పాత్రలో కార్తీక్ రత్నం నటిస్తుండగా, ఆయన బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి శ్యామ్​ కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మణిశర్మ స్వరాలు అందిస్తున్నాడు. సురేశ్​ ప్రొడక్షన్స్ ప్రైవేట్​లిమిటెడ్​, వీ క్రియేషన్స్‌ పతాకాలపై డీ సురేష్‌బాబు, కలైపులి ఎస్‌ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.