Breaking News

నాగార్జునసాగర్ ​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్​4 గేట్ల ఎత్తివేత

నాగార్జునసాగర్: శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వరద ఉధృతి కొనసాగుతుండడంతో శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్‌ 4 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి 3.45 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల కొనసాగుతోంది. నాగార్జునసాగర్​ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 585 అడుగుల మేర ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుతం 271.37 టీఎంసీల నిల్వ ఉంది.

దిగువకు పరుగులు తీస్తున్న కృష్ణాజలాలు