సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలోకి ప్రవేశాలకు అడ్మిషన్లు నిర్వహించేందుకు గాను పరీక్ష తేదీని ప్రభుత్వం ఖరారుచేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో గత ఏప్రిల్లో జరగాల్సిన ఎగ్జామ్ ను వాయిదావేసింది. పరిస్థితులు కుదుటపడుతుండడంతో నవంబర్1న ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. అక్టోబర్15వ తేదీ వరకు గురుకుల వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. మొత్తం రాష్ట్రంలో ఉన్న గురుకులాల్లో 48,240 సీట్ల కోసం 1,48,168 అప్లికేషన్లు వచ్చాయని సంబంధిత అధికారులు తెలిపారు.
- September 12, 2020
- Archive
- స్టడీ
- GURUKULA VIDYALAYA
- HYDERABAD
- SOCIALWALFARE
- TELANGANA
- గురుకుల విద్యాలయం
- తెలంగాణ
- సాంఘిక సంక్షేమశాఖ
- హైదరాబాద్
- Comments Off on నవంబర్ 1న ‘గురుకుల’ 5వ తరగతి ప్రవేశపరీక్ష