Breaking News

నకిలీ సీడ్స్ అమ్మితే పీడీయాక్ట్

సారథి న్యూస్, మెదక్: నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని మంత్రి హరీశ్​రావు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు ఏ పంటను ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే పక్కా సమాచారంతో గ్రీన్ బుక్ రూపొందించాలని సూచించారు. మెదక్​ జిల్లా కలెక్టరేట్ లో మంగళవారం నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డిమాండ్​ ఉన్న పంటలనే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో రైతు అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వచ్చేలా వ్యవసాయశాఖ అధికారులు చొరువ తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఏ ఒక్క రైతుకు రైతుబంధు పెండింగులో ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు.