Breaking News

నకిలీ సీడ్స్ అమ్మితే చెప్పండి

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ ఇ. శ్రీధర్ అన్నారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా విత్తన విక్రయదారులు, వ్యవసాయ అధికారులతో శుక్రవారం జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయిశేఖర్ తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీధర్, రెండవ సారి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతి లేని నకిలీ విత్తనాలను అమ్మితే పీడీ యాక్ట్ చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డీలర్లను హెచ్చరించారు. ఎస్పి సాయి శేఖర్ మాట్లాడుతూ నకిలీ విత్తనాలు ప్రభుత్వం సూచించిన విత్తనాలను మాత్రమే దుకాణాల్లో ఉండాలన్నారు.రైతులకు నష్టం కలిగించే చర్యలు డీలర్లు పూనుకొంటే పోలీస్ శాఖ  కఠినంగా వ్యవహరిస్తుందని పీడీ యాక్ట్ లతోపాటు రైతులకు కలిగిన నష్టం మొత్తాన్ని సంబంధిత డీలర్ ల వద్దనే రికవరీ చేయిస్తామని జిల్లా ఎస్పి సాయి శేఖర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంచార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.