సారథి న్యూస్, మెదక్: జిల్లాలో ఎక్కడైన రైతులకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తామని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో మాట్లాడుతూ రైతులు వ్యయప్రయాసాలకోర్చి పంటలు పండించే అన్నదాతలకు నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయితే కొందరు బ్లాక్‌లో విత్తనాలు అమ్ముతున్నారని వారిపై సంబంధిత శాఖ అధికారులు, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్మే వారిపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారని వ్యవసాయ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోని వ్యవసాయాధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వివరించారు. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు కృష్ణమూర్తి, కిరణ్కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, వ్యవసాయశాఖ అధికారులు, సీడ్ డీలర్లు పాల్గొన్నారు.
- June 19, 2020
- Archive
- మెదక్
- షార్ట్ న్యూస్
- medak
- SEEDS
- కలెక్టర్
- మెదక్
- Comments Off on నకిలీ సీడ్స్ అమ్మితే కేసులు