సారథిన్యూస్, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. సుమారు రూ. 30 లక్షలు విలువైన 15 క్వింటాళ్ల పత్తి విత్తనాలను, వాటిని ప్యాకింగ్ చేసే మిషనరీని, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం కమ్మగూడెంలో నకిలీ విత్తనాలు ఉన్నట్టు పోలీసులకు సమాచారమందింది. కూపీ లాగగా.. ఏపీ, తెలంగాణకు చెందిన ఓ ముఠా ఈ నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్, నల్లగొండ, ఏపీలోని నంద్యాలకు 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరు అక్షర, ఇండిగో కంపెనీల పేరుతో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్టు విచారణలో తేలింది. ఇంకా కొందరు పరారీలో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్పీ రంగనాథ్ తెలిపారు.
- June 23, 2020
- Archive
- క్రైమ్
- AP
- NALGONDA
- NANDYALA
- POLICE
- SEEDS
- ఎస్పీ
- పీడీయాక్ట్
- Comments Off on నకిలీ విత్తన రాకెట్ గుట్టు రట్టు