సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ధోని బయోపిక్ ఎంతో పేరుతెచ్చింది. మహేంద్రసింగ్ ధోని పాత్రలో జీవించిన సుశాంత్ దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇవాళ సుశాంత్ సేవలను దేశమంతా గుర్తుచేసుకుంటున్నదంటే అందుకు కారణం ధోని చిత్రమేనని చెప్పకతప్పదు. సుశాంత్ తీసిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే.. ‘ఎం.ఎస్.ధోని’ ఒకెత్తు. ఈ చిత్రం తెలుగుతోపాటు ఇతర భాషల్లోకీ డబ్ కావడంతో సుశాంత్ టాలెంట్ అందరికీ తెలిసింది. అందుకే అతడి మరణవార్త విన్న మహేష్ బాబు, ఎన్టీయార్, రామ్ చరణ్ వంటి తెలుగు హీరోలతోపాటు తమిళ, మలయాళ చిత్రాలకు చెందిన పలువురు షాక్ తిన్నారు. అంత గొప్పనటుడు.. ఇంత చిన్నవయస్సులో మరణించడం జీర్ణించుకోలేకపోతున్నాం’ అంటూ సంతాపం తెలిపారు.
- June 15, 2020
- Archive
- సినిమా
- BIOPIC
- DHONI
- SUSHANTH
- TAMIL
- TOLLYWOOD
- గొప్పనటుడు
- మలయాళ
- Comments Off on ధోని బయోపిక్ తో గుర్తింపు