సారథి న్యూస్, రామగుండం: కరోనా బాధితులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని రామగుండం సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. తగిన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి కోలుకోవచ్చని చెప్పారు. దేశంలో కరోనా బారినపడి ఎంతో మంది 85 శాతంపైనే కరోనా నుంచి కోలుకున్నారని చెప్పారు. గురువారం సీపీ ఆదేశాల మేరకు డీసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయి చికిత్సపొందుతున్న పోలీసులకు రోగనిరోధకశక్తిని పెంచే పండ్లు, డ్రైఫ్రూట్స్, టాబ్లెట్స్ అందజేశారు. కరోనా బారినపడ్డ ప్రతి పోలీసుకు కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ ఏఆర్ సుందర్ రావు, కోవిడ్ సెల్ ఇంచార్జి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీశ్, ఆర్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
- July 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CARONA
- CP
- POLICE
- RAMAGUNDEM
- కరోనా
- డీసీపీ
- Comments Off on ధైర్యంగా ఉండాలె