సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పెనుగోలు కాలనీ, మండపాక గ్రామాల్లో వాజేడు వైద్యబృందం ఆధ్వర్యంలో దోమ తెరలను పంపిణీ చేశారు. అనంతరం ‘ఫ్రై డే.. డ్రై డే’ కార్యక్రమాన్ని నిర్వహించి నిల్వ ఉన్న నీటిని పారబోశారు. మెడికల్ ఆఫీసర్ మంకిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ మాస్కులు కట్టుకుని, భౌతికదూరం పాటించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి వైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ శరత్ బాబు, హెల్త్ సూపర్వైజర్కోటిరెడ్డి, ఏఎన్ఎం రాజేశ్వరి, చిన్న వెంకటేశ్వర్లు, ఆశా వర్కర్ సమ్మక్క, నాగలక్ష్మి పాల్గొన్నారు.