Breaking News

దోపిడీకి తెరలేపారు

సారథిన్యూస్​, నిజామాబాద్​: కరోనాతో జనాలు ఇబ్బందులు పడుతుంటే.. ఇదే అదనుగా చేసుకొని నిజామాబాద్​ జిల్లాలో మెడికల్​ దుకాణాలు దోపిడీ పర్వానికి తెరలేపాయి. కరోనా మందులను ఎమ్మార్పీ కంటే రెట్టింపు ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చాలా చోట్ల కృత్రిమ కొరత సృష్టించి పేదప్రజలను నిలువునా ముంచుతున్నారు. ప్రజలు వైద్యం కోసం ఉన్న బంగారం, ఆస్తులు అమ్ముకుంటున్నారు. కాగా ఈ దోపిడీ దందాపై మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి స్పందించారు. జిల్లాలోని మెడికల్​ షాపులను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్​ నారాయణరెడ్డి, డ్రగ్​ ఏడీ రాజ్యలక్ష్మి ఆదేశించారు. అధికధరలకు విక్రయిస్తున్న షాపుల లైసెన్స్​ రద్దు చేయాలని సూచించారు. జిల్లాలో కరోనా పరీక్షలను పెంచుతామని, ప్రజల ఆరోగ్యాలను కాపాడుతామని పేర్కొన్నారు.