నాని మూవీ ‘జెంటిల్మెన్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేదా థామస్ ఆ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. అయితే నివేదా బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. మంచి నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానం సంపాదంచింది. ‘పాపనాశం’ సినిమాలో కమల్ హాసన్ కూతురుగా నటించింది. నాని ‘జెంటిల్ మెన్’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన నివేదా థామస్.. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో తెలుగు వారికి మరింత దగ్గరైంది. ఈ ఏడాది ప్రారంభంలో ‘దర్బార్’ సినిమాలో రజినీకాంత్ కూతురుగా కనిపించిన నివేదా థామస్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్’లో కీలకపాత్ర చేస్తోంది.
ప్రస్తుతం నివేదా నటించిన ‘వి’ సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాని, సుధీర్ బాబు, అదితి రావ్ హైదరీ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ‘వి’ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో నివేదా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో అపూర్వ అనే క్రైమ్ నవలా రచయితగా కనిపిస్తాను.. ఈ పాత్ర ఎంత క్రమశిక్షణగా ఉంటుందో అంతే డేరింగ్ గా ఉంటుంది.. అంతేకాదు ఓటీటీ కోసం వర్క్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.. ఇప్పుడు నేనున్న పొజిషన్ ను ఎంజాయ్ చేస్తున్నాను.. ఎలాంటి స్టార్ స్టేటస్ కోసం నేను ఆలోచించను.. నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా నేను రెడీనే.. నేను కోరుకునేది ఓ మంచి నటిగా గుర్తింపు మాత్రమే..’ అంటూ చెప్పుకొచ్చింది.