Breaking News

‘దిశ’ ట్రైలర్ టాక్

‘దిశ’ ట్రైలర్ టాక్


జనం మరచిపోతున్న దారుణాలను కథలుగా చేసుకుని సినిమా రూపంలో తెరకెక్కించడంలో దిట్ట రామ్ గోపాల్ వర్మ. సినీ, రాజకీయ ప్రముఖుల బయోపిక్స్ తో పాటు కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తోనూ సినిమాలు రూపొందించాడు. గతేడాది నవంబర్ 26న తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటన ఆధారంగా ‘దిశ ఎన్ కౌంటర్’ పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నాడు. వర్మ శిష్యుడు ఆనంద్‌ చంద్ర దర్శకుడు. నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశాడు వర్మ. ‘దిశ’ ఘటనను లైవ్ లో చూసినట్లుగా ట్రైలర్ లో చూపించాడు.

ఓ అమ్మాయి బైక్ ను పార్క్ చేయడం.. అక్కడ ఓ నలుగురు యువకులు ఆ అమ్మాయిని చూడడం.. ఆ తర్వాత బైక్ ను పంచర్ చేయడం, ఆమెను బలవంతంగా ఎత్తుకెళ్లడం.. ఆ తర్వాత లారీలో తీసుకెళ్లి ఊరు చివర ఓ బ్రిడ్జ్ కింద పెట్రోల్ పోసి చంపేయడం, వారిని పోలీసులు ఎన్ కౌంటర్ లో చంపేయడం లాంటి సన్నివేశాలను అచ్చుగుద్దినట్టుగా చూపించిన ట్రైలర్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా బ్యాక్​గ్రౌండ్ స్కోరుతో జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఇక ఈ సినిమాను ఘటన జరిగిన ఏడాదికి అదే రోజునే నవంబర్ 26, 2020న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో ‘దిశ’గా సోనియా ఆకుల నటించింది.

https://youtu.be/8P6arAV-Lsg