సారథి న్యూస్, హైదరాబాద్: దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాహితీ యోధుడని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన అందించిన ఉద్యమ చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. దాశరథి కృష్ణమాచార్యుల 96వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళులు అర్పించారు. దాశరథి రగిలించిన చైతన్య స్ఫూర్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకు కావాల్సిన సంకల్ప బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. సాహిత్యరంగానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఏటా అధికారికంగా ఆయన జయంతి వేడుకలను నిర్వహిస్తూ.. అవార్డులను ప్రదానం చేస్తోందని గుర్తుచేశారు.
- July 22, 2020
- Archive
- తెలంగాణ
- CM KCR
- DASHARATHI
- TELANAGNA
- కృష్ణమాచార్యులు
- జయంతి
- దాశరథి
- సీఎం కేసీఆర్
- Comments Off on దాశరథి చైతన్య స్ఫూర్తిని కొనసాగిస్తాం