సారథి న్యూస్, హైదరాబాద్: వరంగల్ లో ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు జరిగే భద్రకాళీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాల పోస్టర్ ను గురువారం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆవిష్కరించారు. ప్రతిఏటా ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవాలకు రావాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఆలయ ఈఓ సునీత, సూపరింటెండెంట్ విజయ్ కుమార్, అర్చకులు నాగరాజుశర్మ పాల్గొన్నారు.
- October 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- DASARA
- DEVADAYAMA DEPARTMENT
- MAHANKALI TEMPLE
- దసరా
- దేవాదాయశాఖ
- వరంగల్
- సీఎం కేసీఆర్
- Comments Off on దసరా మహోత్సవాలకు రండి