Breaking News

దశాబ్దాల కల నెరవేరింది

దశాబ్దాల కల నెరవేరింది

సారథి న్యూస్​, కర్నూలు: మూడు రాజధానులకు గవర్నర్​ విశ్వభూషణ్‌ ఆమోదముద్ర వేయడం సంతోషకరమని, సీమ ప్రజల ఆరు దశాబ్దాల కల నెరవేరిందని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ సీఆర్‌డీఏ 2014 బిల్లును రద్దుచేస్తూ.. మూడు రాజధానులకు ఆమోదముద్ర వేయడంతో కర్నూలు నగరంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని కొండారెడ్డి బురుజు వద్ద ఎమ్మెల్యేు కాటసాని రాంభూపాల్‌ రెడ్డి, ఎంఏ హఫీజ్‌ఖాన్‌ స్వీట్లు పంచారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రాయసీమ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నారని, కర్నూలును న్యాయరాజధానిగా ఆమోదముద్ర వేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాయసీమ ప్రజలు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. శాసన రాజధానిగా అమరావతి, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును కొనసాగిస్తామన్నారు.