సారథి న్యూస్, కర్నూలు: జిల్లాలోని దళితులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారని, అందుకు తనవంతు సహకారం అందిస్తానని దళిత పారిశ్రామిక సంఘ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మామిడి సుదర్శన్ అన్నారు. కర్నూలు జిల్లా పరిశ్రము, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సభ్యుడు జెరదొడ్డి జయన్న నేతృత్వంలో ఆదివారం కోల్స్ తొగు బాప్టిస్ట్ చర్చ్ వెనుక దళిత పారిశ్రామిక సంఘం కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్మామిడి సుదర్శన్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌కుమార్, డాక్టర్ మోహన్ రావు, బీజేపీ జిల్లా నాయకులు మోజెస్, టీడీపీ జిల్లా నాయకు జేమ్స్, మాజీ సర్పంచ్ సిమియో, నాగరాజు, కృష్ణబాబు రాజు, మురళి, సందీప్, గిడ్డమూర్తి, అశోక్, చిన్న, వినోద్, జోయల్ పాల్గొన్నారు.
- September 28, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- BJP
- DALITHMORCHA
- Kurnool
- డీఐఈపీసీ
- దళితులు
- బీజేపీ దళిత మోర్చా
- Comments Off on దళితులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి