తెలుగులో బోలెడు సినిమాలు చేసి కోలీవుడ్లో పాగా వేసింది హీరోయిన్ త్రిష. అక్కడ ఆమె కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతకు ముందు మాదిరిగా గ్లామర్పాత్రలు కాకుండా ఫిమేల్ సెంట్రిక్ కథలను ఎంచుకుంటోంది. అలాగే విమెన్ ఓరియెంటెడ్ చిత్రాలే ఎక్కువగా చేస్తోంది కూడా. అందుకేనేమో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఆచార్య’లో కూడా ఆఫర్ వచ్చినా వద్దనుకుంది అంటున్నారు. అయితే త్రిష గర్జనై, రాంగీ, పొన్నియన్ సెల్వం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం త్రిష, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కుట్రపయిరిచి’ అనే తమిళ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి బాలా శిష్యుడు దర్శకత్వం వహించనున్నారు. యువనాయిక సురభి, సుబ్బరాయ ఇందులో ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో త్రిష ఖాకీ డ్రెస్ వేస్తుందట. ఇంతకు ముందు విశాల్ తో కలిసి ‘వేటాడు వెంటాడు’ చిత్రంలో త్రిష ఇంటరెస్టింగ్ రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆ పాత్ర సీక్రెట్ ఏజెంటా? పోలీస్ఆఫీసరా? అన్న విషయం తెలియాలి.